భారత మార్కెట్లోకి ఒపో ఎఫ్7 'డైమండ్ బ్లాక్'
భారత మార్కెట్లోకి ఒపో ఎఫ్7 'డైమండ్ బ్లాక్'
ఒపో స౦స్థ నుండి వస్తున్న కొత్త ఫోన్ 'ఎఫ్7' డైమండ్ బ్లాక్ వేరియంట్ అమ్మకాలు భారత్ లో ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్నాయి. దీని ధర రూ.26,990. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, పేటీఎం ఆన్‌లైన్ సంస్థల ద్వారా మరియు దేశవ్యాప్తంగా ఒప్పో విక్రయ కేంద్రాల్లోనూ ఇవి లభ్యమవుతాయి. మొట్టమొదటిసారిగా ఫుల్‌హెచ్‌డీ, సూపర్ ఫుల్ స్క్రీన్ తెరతో అందుబాటులోకి తెస్తోన్న ఫోన్ ఇదే. దీనిలో 6జీబీ ర్యామ్, 128 జీబీ రోమ్, ముందు వైపు 25 మెగాపిక్సెల్ కెమేరాలు లాంటి ప్రత్యేకతలున్నాయి.

Post a Comment