Header Ads

గల్లీలో యువకులతో క్రికెట్ ఆడిన సచిన్..వీడియో

గల్లీలో యువకులతో క్రికెట్ ఆడిన సచిన్..వీడియో

క్రికెట్ దిగ్గజం.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ గల్లీలో క్రికెట్ ఆడడం ఏమిటని ఆశ్చర్య పోతున్నారా? అవును అంతర్జాతీయ క్రికెట్ లో ఓ వెలుగు వెలిగిన సచిన్.. సరదాగా గల్లీలో యువకులతో క్రికెట్ ఆడారు. సచిన్ రాత్రి సమయంలో ఇంటికి వెళ్తున్న క్రమంలో గల్లీలో కొంతమంది యువకులు క్రికెట్ ఆడుతూ కనిపించారు.అది గమనించిన సచిన్ వెంటనే కారు ఆపి దిగేసి వారి దగ్గరకు వెళ్లారు.బ్యాట్ తీసుకుని సరదాగా వారితో గల్లీలో క్రికెట్ ఆడారు. యువకులతో కలిసి సరదాగా మాట్లాడారు.అనంతరం వారితో కలిసి సెల్ఫీ లు దిగారు. అయితే స్వయంగా సచిన్ వచ్చి క్రికెట్ ఆడటం పట్ల అక్కడున్న యువకులు ఆశ్చర్యపోయారు. 

No comments

Powered by Blogger.