Header Ads

సుకుమార్‌తో సినిమా లేదు మహేష్‌

రంగస్థలం లాంటి ఘన విజయం తరువాత దర్శకుడు సుకుమార్‌ ఫుల్ బిజీ అవుతాడని అంతా ఊహించారు. సుకుమార్ కూడా అదే జోరులో సూపర్‌స్టార్ మహేష్‌తో సినిమా ఓకె చేయించుకొని ఫుల్‌ ఫాంలో కనిపించాడు. కానీ ప్రస్తుతం సీన్‌ పూర్తిగా మారిపోయినట్టుగా అనిపిస్తోంది. సుకుమార్‌తో సినిమా లేదని మహేష్‌ స్వయంగా ప్రకటించాడు.
అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందన్న ఎనౌన్స్‌మెంట్ వచ్చినా ఆ ప్రాజెక్ట్ ఇప్పట్లో పట్టాలెక్కేలా లేదు. దర్శకుడిగా ఇలా ఉంటే నిర్మాతగానూ సుకుమార్ కెరీర్‌ అంతా ఆశాజనకంగా కనిపించటం లేదు. ఇప్పటికే కుమారి 21ఎఫ్, దర్శకుడు లాంటి సినిమాలను నిర్మించిన సుక్కు తరువాత కూడా వరుససినిమాలకు ప్లాన్ చేశాడు.

No comments

Powered by Blogger.